LATEST UPDATES

Tuesday, January 9, 2024

పసుపు లో దుంపకుళ్ళు తెగులు వాటి యాజమాన్యం

          విత్తన శుద్ధి చేయని కొమ్మలను నాటుకోవటం, మురుగునీటి పారుదల సరిగా లేకపోవటం, ఎడతెరపి లేని వర్షాలు కురిసి మొక్కల చుట్టూ నీరు నిలబడి ఉండడం, సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించకపోవడం, వేపపిండి, పొటాష్ సక్రమంగా వాడకపోవటం వల్ల ఈ తెగులు ఆశించటానికి ప్రధాన కారణం. 
          ఈ తెగులు ఆశించినప్పుడు ముదురు ఆకులు ముందుగా వాడిపోయి గోధుమరంగుకు మారి ఎండిపోతాయి. తరువాత లేత ఆకులకు ఈ తెగులు వ్యాపిస్తుంది. తల్లి, పిల్ల దుంపలు కుళ్లి మెత్తబడి, చెడు వాసన వస్తాయి. 
నివారణ చర్యలు: 
          ఆరోగ్యమైన తెగులు సోకని దుంపలను నాటుకోవటానికి విత్తనంగా ఎన్నుకోవాలి. దుంపలు నాటుకోవడానికి ముందు 5 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి పొడిని లీటరు నీటికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని, నీడలో ఆరబెట్టుకోవాలి. ఒక అడుగు ఎత్తు, ఒక మీటరు వెడల్పు కలిగిన ఎత్తైన మడులను ఏర్పరుచుకొని దుంపలను నాటుకోవాలి. ఒక కిలో ట్రైకోడెర్మాను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో కలిపి వారం రోజులపాటు అనువైన పద్దతిలో వృద్ధి చేసి ఆఖరు దుక్కిలో లేదా నెలరోజులకు మొదటిసారిగా కలుపు తీసాక తడి ఇచ్చిన వెంటనే వేసుకోవాలి. 
           పైన చెప్పిన పద్ధతులు పాటించినట్లయితే తెగులు ఉధృతిని తగ్గించవచ్చు.


No comments:

Post a Comment

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates