LATEST UPDATES

Sunday, January 14, 2024

అండుకొర్రల సాగు విధానం

          ప్రస్తుతం మారుతున్న జీవన శైలిలో చిన్న వయస్సు నుండే మధుమేహం, గుండెసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. చిరుధాన్యాలతో ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు అని వీటి ప్రత్యేకతను గుర్తించి వీటి సాగుపై మొగ్గు చూపుతున్నారు. 
          ఈ చిరుధాన్యాలలో అరుదైనవి అండుకొర్రలు (Brown Top Millets). అధిక ఉష్ణోగ్రతలను, బెట్ట పరిస్థితులను తట్టుకొని సారంలేని నేలలోనూ ఆశించినంత దిగుబడులను పొందుతుండటంతో మెట్ట ప్రాంత రైతులు అండుకొర్రలు సాగుచేస్తున్నారు. 
          అండుకొర్రలు సంపూర్ణ సమతుల్య పోషక విలువలతో పాటు రుచిలోనూ అద్భుతంగా ఉంటాయి. ఇవి గ్లూటిన్ రహితంగా అధిక పీచు పదార్ధం (12%) కలిగి ఉంటాయి. కొంతకాలం ముందు వీటిని పశుగ్రాసంగా అధికంగా సాగుచేసేవారు. ఇటీవల కాలంలో దీని ప్రాముఖ్యత పెరిగి చిరుధాన్య పంటగా రైతులు సాగు చేస్తున్నారు. 

సాగు వివరాలు:
          విత్తనం నాటడానికి ముందు కల్టివేటర్ తో సన్నటి దుక్కి చేసుకోవడం వలన భూమిలో తేమ శాతం నిలుపుకోవడంతో పాటు మొలక శాతం పెరుగుతుంది. అండుకొర్రలను ప్రధాన పంటగాను, మిశ్రమ పంటగాను సాగుచేసుకోవచ్చు. ఆగస్టు మధ్య వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తుకోవటం వల్ల దిగుబడి తగ్గే అవకాశముంది. ముందుగా విత్తుకోవడం వల్ల మొవ్వ ఈగ నుండి రక్షణ పొందవచ్చు. ఎకరానికి 6-7 క్వింటాళ్ల గింజ దిగుబడితో పాటు 4 ట్రాక్టర్లకు సరిపడా పశుగ్రాసం పొందవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR) వారు ప్రాసెసింగ్ యంత్రాలపై అవగాహన మరియు శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నారు.

No comments:

Post a Comment

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates