LATEST UPDATES

Tuesday, December 19, 2023

సీతాఫలం అద్భుత పోషకం

      వర్షాకాలం లో ఎక్కువ గా దొరికే ఫలాల్లో సీతాఫలం ఒకటి. ఇందులో నోరూరించే రుచే కాదు .. ఎన్నో అద్భుత పోషకాలు ఉన్నాయి. మరెన్నో ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.  పిల్లల నుంచి పెద్దల వరకు.. సీతాఫలాన్ని ఎంతగానో ఇష్టపడతారు.


            సీతాఫలంలో విటమిన్ "ఏ" పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాదు చర్మం, కురులను ఆరోగ్యంగా ఉంచుతుంది. 


      ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే మెగ్నీషియం, సోడియం, పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులోని ఇతర పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని కరిగించి మంచి కొవ్వులను వృద్ధి చేస్తాయి. కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. 

             దీనిలోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది, మహిళల్లో రక్తహీనతను నివారిస్తుంది. ఎనీమియాకు అడ్డుకట్ట వేస్తుంది. 

        విటమిన్ బి కడుపు ఉబ్బరాన్ని, అజీర్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా నెలసరి అసౌకర్యానికి ఇది చక్కని మందుగా పనిచేస్తుంది. సీతాఫలం అల్సర్‌లను నయం చేయడంలో సహాయపడుతుంది మరియు అసిడిటీని నివారిస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.


                 పీసీఓఎస్‌ ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య. హార్మోన్ల అసమతుల్యతతో నీరసం, చిరాకు వంటివి అదనం. ఈ పండును రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఈ సమస్యలన్నీ తొలగుతాయి. మహిళల్లో గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. దీనిలోని పీచు గర్భిణీల్లో మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు వికారం వాంతులను తగ్గిస్తాయి. గర్భిణీ స్త్రీలు సీతాఫలాన్ని తినడం వల్ల కడుపులో పెరుగుతున్న శిశువు మెదడు, నాడీ వ్యవస్థ మరియు రోగనిరోధక శక్తి పెరగడంలో సహాయపడుతుంది.

                సీతాఫలంలో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక రకాల కణతులను క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడతాయి. ఆల్కలాయిడ్లు, అసిటోజెన్లు ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తాయి. 

         100 గ్రాముల సీతాఫలంతో 94 కేలరీల శక్తి లభిస్తుంది. అదే జామలో అయితే 49, ఆపిల్ లో 56, బొప్పాయిలో 32, మామిడిలో 70 క్యాలరీలు ఉంటాయి. దీనిని బట్టి ఈ పండ్లతో పోలిస్తే సీతాఫలం ఎంత మంచిదో ఇట్టే తెలుసుకోవచ్చు. 

        సన్నగా ఉన్నవారు ఇది తింటే ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదు. నీరసంగా ఉన్నప్పుడు ఒక పండు తింటే వెంటనే శక్తి వస్తుంది. అర్థరాయిడ్ లక్షణాలను నివారిస్తుంది.


గమనిక: ఈ వివరాలు ఆరోగ్య నిపుణులు మరియు అధ్యయనాల ప్రకారం అందించబడ్డాయి. ఈ వ్యాసం మీ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యకు వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

No comments:

Post a Comment

@2017 All Rights Reserved. Designed by WWW.SMARTWAY4STUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates